Home » Tirumala
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
బాలికతో తన ప్రేమ విఫలమైందంటూ హల్చల్ చేసిన ఒక హాకర్‌ను తిరుమల నుంచి బహిష్కరిస్తున్నట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు.
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు.
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమే అని కోర్టు పేర్కొంది.
టీటీడీ పరకామణి కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు.