Somireddy: శ్రీవారి హుండీ విషయంలో జగన్ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:58 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
నెల్లూరు, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరు వేదికగా మీడియాతో మాట్లాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ అంటే అంత లోకువగా ఉందా అని ఫైర్ అయ్యారు. పరకామణి చోరీ కేసు విషయంలో అహకారంతో జగన్ మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదని వార్నింగ్ ఇచ్చారు.టీటీడీ హుండీ చోరీ చేస్తే తప్పేంటని అంటావా...? అని ఫైర్ అయ్యారు. పవిత్రమైన శ్రీవారి హుండీలో చేయి పెట్టినా తప్పు లేదన్నట్లుగా మాట్లాడుతావా...? అని మండిపడ్డారు.
శ్రీవారినే నిలువు దోపిడీ చేశావు..
‘వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత కోరికలు తీరిన భక్తులు తమ నగలను శ్రీవారికి సమర్పించుకుంటారని.. కానీ నువ్వు శ్రీవారినే నిలువు దోపిడీ చేసిన రకం. సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో నువ్వు అనేక పాపాలు చేశావు. ఆ పాపాలే శాపాలై నిన్ను 11 సీట్లకు పరిమితం చేసింది. అయినా ఇంకా విమర్శిస్తునే ఉన్నావు. శ్రీవారి హుండీ నుంచి రూపాయి తీసినా పాపమే... అలాంటింది పరకామణి చోరీ... ఏదో చిన్న చోరీ అంటావా..? నీకు ఎంత ధైర్యం. ఒకటి గుర్తుంచుకో.. నువ్వు చేసిన పాపాలకు ఎక్కడ దాకున్నా మీ దేవుడు కూడా అసహ్యించుకుంటారు. భగవంతుడి విషయంలో అహంకారపూరితంగా మాట్లాడిన నిన్ను మీ దేవుడు కూడా క్షమించరు. శ్రీవారి హుండీ విషయంలో జగన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీలోని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా మరో మతాన్ని విమర్శిస్తే సమర్థించరు’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన
Read Latest AP News and National News