నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.
తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.
Jagan Tour: నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పర్యటన వేళ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగరంలో ఎటు చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో హైటెన్షన్ వాతవరణం ఏర్పడింది.
Anil Kumar: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మరి ఈసారైనా ఆయన విచారణకు హాజరవుతారా? లేదా ? చూడాలి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ నెల 31వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ మాట్లాడారు.
క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు.
Local Body Funds: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఇంటింటికీ వెళ్లి అధికారులు పంపిణీ చేశారని.. వాలెంటరీ వ్యవస్థ లేకుండానే అమలు చేశారని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్‌లో 28 వేల కోట్లు రూపాయలు ఇస్తామంటే, 2 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం వినియోగించు కోలేదని విమర్శించారు.
ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.