Minister Anam: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:30 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
నెల్లూరు,డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గాంధీజన సంఘం గ్రామంలో పర్యటించారు మంత్రి ఆనం. దిత్వా తుఫానును సైతం లెక్కచేయకుండా వర్షంలో పేదల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఏపీలో ప్రతీ నెలా ఒకటో తేదీన పండుగ వాతావరణం ఉంటుందని తెలిపారు. కొన్ని లక్షల ఇళ్లను కట్టకుండానే కట్టినట్లుగా చూపించి గత జగన్ ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లు డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ నిధులు సమకూర్చుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 36,937 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పేదల శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. వీర్లగుడిపాడు బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత సీసీ రోడ్లకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఏపీలో ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చిన ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ఆగదని చెప్పుకొచ్చారు. ఇంత వయస్సులో సైతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక
Read Latest AP News And Telugu News