Share News

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:55 AM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు
Kakani Govardhan Reddy

నెల్లూరు, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి (Kakani Govardhan Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కాకణిపై ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కాకణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు..

మరోవైపు.. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. 2014 ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుళ్లు వేసి, ఓటర్లకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తాగి అపట్లో పలువురు మృతిచెందగా... వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2018లోనే కొన్ని కీలక ఫైళ్లు మిస్ అయినట్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో సీఐడీకి కేసును అప్పగించింది న్యాయస్థానం. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తు చేయలేదు. ప్రస్తుతం మళ్లీ తెరపైకి ఈ కేసు వచ్చింది. ఈ కేసును నీరుగార్చేందుకే కీలక‌ ఫైళ్లు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 12:11 PM