Home » Kakani Govardhan Reddy
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.
నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.
Kakani Police Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి మొదటి రోజు 30 ప్రశ్నలు సంధించారు పోలీసులు.
అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్‌పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
Kakani: గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అనధికారంగా కాకాణి టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనిపై కాకాణీని విచారించనున్నారు.
Kakani Govardhan Reddy: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నాల్గవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
గ్రావెల్ కుంభకోణం కేసుకు సంబంధించి రెండో రోజు గురువారం విచారణలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
Kakani SIT Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు తరలించింది. న్యాయవాది సమక్షంలో సిట్ విచారణ జరుగనుంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కేసులో నెల్లూరు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎందుకంటే..
Kakani Govardhan: అనధికార టోల్‌గేట్ ఏర్పాటుపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవగా.. ఏ1గా కాకాణి ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.