Kakani Police Custody: అక్రమ తవ్వకాల కేసు.. రెండో రోజు పోలీసు కస్టడీకి కాకాణి
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:54 AM
Kakani Police Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి మొదటి రోజు 30 ప్రశ్నలు సంధించారు పోలీసులు.

Kakani Police Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Minister Kakani Goverdhan Reddy) రెండో రోజు విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీలోకి (Police Custody) తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈరోజు (గురువారం) ఉదయం నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి తొలి రోజు కస్టడీలో మొత్తం 30 ప్రశ్నలు అడిగారు వెంకటాచలం పోలీసులు.
రాజకీయంగా, వ్యాపారపరంగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల వివరాలు, వ్యాపార సంస్థలు వివరాలను కాకాణిని పోలీసులు అడిగారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మందల వెంకట శేషయ్య గురించి, ఆయనతో ఉన్న సంబంధాలు, అల్లంపాటి నిరంజన్ రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీల విషయంలో మాజీ మంత్రిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, న్యాయవాది ఎదుట కాకాణిని పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగిసిన అనంతరం తిరిగి మాజీ మంత్రి కాకాణిని జిల్లా జైలుకు తరలించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 29మంది సెలెబ్రిటీలపై ఈడీ కేసు
Read Latest AP News And Telugu News