Andhrapradesh Census: ఏపీలో జనగణనకు ప్రభుత్వం పచ్చ జెండా
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:46 PM
Andhrapradesh Census: 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

అమరావతి, జులై 10: రాష్ట్రంలో జనగణన (Census) చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఈరోజు (గురువారం) జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను సర్కార్ తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిర్ణయించిన విషయం తెలిసిందే. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభంకానుంది. అదేరోజు ఏపీ వ్యాప్తంగా కూడా జనగణన ప్రక్రియ మొదలుకానుంది.
కాగా.. భారత జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశ అక్టోబర్ 1, 2026 నుంచి మొదలుకానుంది. తొలిదశలో జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జనగణన జరుగనుంది. ఇక రెండవ దశ మార్చి 1, 2027 నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి
నిరుపేద కుటుంబానికి హోంమంత్రి అనిత అండ
నా కుమారులను రక్షించండి.. మహిళ వినతి.. స్పందించిన పవన్
Read Latest AP News And Telugu News