Share News

Minister Lokesh Mega PTM: స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:14 PM

Minister Lokesh Mega PTM: స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు.

Minister Lokesh Mega PTM: స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్
Minister Lokesh Mega PTM

పుట్టపర్తి, జులై 10: గురు పౌర్ణమి నాడు పుట్టపర్తిలో మెగా పీటీఎమ్ (Mega PTM) కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమ్మంటే రెండు అక్షరాలు కాదని.. అమ్మను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను విద్యాశాఖ మంత్రి అవగానే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు, పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాలు ఉండవని.. బడి గేటు బయటనే పాలిటిక్స్ అని చెప్పుకొచ్చారు.


స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపు నిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు. ప్రతి మొక్కకు గ్రీన్ పాస్ పోస్ట్ ఇస్తున్నామని తెలిపారు. గ్రీన్ పాస్ పోస్ట్ ద్వారా మొక్క పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయానని... కానీ కసితో కష్టపడి 2024లో భారీ మెజార్టీతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. ఒక్క మార్కు తక్కువ వస్తే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారని... ఇలా చేయడం తప్పని.. పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.


సవాళ్లు ఎదుర్కోవడం అంటే తనకు ఇష్టమన్నారు మంత్రి లోకేష్. విద్యాశాఖలో లీప్ యాప్ తీసుకొచ్చామని.. దీన్ని పేరెంట్స్ అందరూ డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉండే పిల్లల వివరాలు, విద్యా ప్రమాణాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి సూచనలు కూడా చేయవచ్చన్నారు. డ్రగ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని... అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై జరిగిన సంఘటన తనను కలచి వేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందారని మంత్రి నారా లోకేష్ ఆవేదన చెందారు.


ఇవి కూడా చదవండి

మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి.. వైసీపీ శ్రేణులపై కేసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2025 | 01:58 PM