Kurnool: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:54 AM
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‍ను స్కార్పియో ఢీకొట్టింది.

కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‍ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాద సమయంలో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మూడు నెలల చిన్నారి నాదియా ప్రాణాలు విడిచింది. మృతులంతా కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. రోడ్డుప్రమాదంపై సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read:
ఆ నాలుగు విమానాశ్రయాలకు హడ్కో రుణం
ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్
For More Andhrapradesh News