Share News

Sirma SGS Technologies: ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:00 AM

దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ పీసీబీ, కాపర్‌ క్లాడ్‌ లామినేట్‌ సీసీఎల్‌ తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది..

Sirma SGS Technologies: ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్‌

నాయుడుపేటలో ఏర్పాటుకు ‘సిర్మా ఎస్‌జీఎస్‌’ సన్నాహాలు

దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీ), కాపర్‌ క్లాడ్‌ లామినేట్‌ (సీసీఎల్‌) తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. చెన్నైకి చెందిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూ.1,800 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఏడాదికల్లా ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మూలధన రాయితీ, విద్యుత్తు సుంకంపై రాయితీ.. తదితర ప్రోత్సాహకాలు పొందేందుకు ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌.. దక్షిణ కొరియాకు చెందిన షిన్హూప్‌ ఎలకా్ట్రనిక్స్‌తో భాగస్వామ్యం కోసం చూస్తోంది’ అని ఆ వర్గాలు వివరించాయి.

Updated Date - Jul 10 , 2025 | 06:00 AM