యూనివర్సిటీ కళాశాలలో పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం అనంతపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాల్ మనీ అరాచకాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆకృత్యాలు వెలుగుచూశాయి. అనంతపురం నగరంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారి బాబ్ జాన్‌ను వడ్డీ వ్యాపారులు చితకబాదారు.
చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
Tadipatri Tension: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే కేతిరెడ్డి పెద్దారెడ్డి బైఠాయించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Liquor Sales: ఏపీలోని అనంతరపురం జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే 92 శాతం అధికమని అధికారులు తెలిపారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, ధరలు తగ్గడమే ఇందుకు కారణమని చెప్పారు.
జిల్లా గృహ నిర్మాణ శాఖలో వైసీపీ హయాం నుంచి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడిన ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.సాంబశివయ్య పాపం ఎట్టకేలకు పండింది..
Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.