GRIEVENCE: తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరా?
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:23 AM
పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు.
హిందూపురం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, తహసీల్దార్ వెంకటేశ, మండలస్థాయి అధికారులు హాజరయ్యారు. రైతులు ప్రజాదర్బార్‌లో తహసీల్దార్‌తో మాట్లాడుతూ.. భూములు తీసుకుని నష్టపరిహారం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చినా రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఇలాగే అయితే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ద్వారా ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకుంటామన్నారు. అనంతరం మండలంలోని ప్రజలు పలు రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. కార్పొరేషన డైరెక్టర్లు బేవనహళ్లి ఆనంద్, గంగాధర్ పాల్గొన్నారు.