Share News

Anitha Supports Poor Family: నిరుపేద కుటుంబానికి హోంమంత్రి అనిత అండ

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:33 PM

Anitha Supports Poor Family: 2012లో జరిగిన రోడ్డు ప్రమాదం బాబ్జిని వికలాంగుడిగా మార్చింది. దీంతో కుటుంబపోషణ భారంగా మారింది. ఈక్రమంలో వారం రోజులు క్రితం నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్నాడు బాబ్జి.

Anitha Supports Poor Family: నిరుపేద కుటుంబానికి హోంమంత్రి అనిత అండ
Anitha Supports Poor Family

అనకాపల్లి జిల్లా, జులై 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పిలుపు మేరకు ‘జీరో పావర్టీ - పీ4 - మార్గదర్శి - బంగారు కుటుంబం’ పాలసీకి విశేష స్పందన వస్తోంది. పేదలకు చేయూతనిచ్చేందుకు పీ4లో భాగస్వాములయ్యేందుకు సంపన్న వర్గాలు ముందుకు వస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ఓ నిరుపేద కుటంబానికి హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అండగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు హోం మంత్రి. పీ4 విధానంలో నిరుపేద కుటుంబానికి మంత్రి అనిత అన్ని విధాలుగా సాయంగా నిలిచారు.


యస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన బాబ్జి కుటుంబానికి ఉపాధి కొరకు రెండు జర్సీ ఆవులను కొనిచ్చారు మంత్రి. అలాగే వారి కుమారుడు రూపస్ చదువు పూర్తయ్యే వరకు అయ్యే పూర్తి ఖర్చును హోంమంత్రి భుజాన వేసుకున్నారు. తక్షణం ఆర్థిక సహాయం అందజేశారు.


2012లో జరిగిన రోడ్డు ప్రమాదం బాబ్జిని వికలాంగుడిగా మార్చింది. దీంతో కుటుంబపోషణ భారంగా మారింది. ఈక్రమంలో వారం రోజులు క్రితం నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్నాడు బాబ్జి. బాబ్జి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ దీనస్థితి విని మంత్రి చలించిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహాయజ్ఞం ‘జీరో పావర్టీ - P4 -మార్గదర్శి - బంగారు కుటుంబం’ ద్వారా బాబ్జి కుటుంబానికి హోంమంత్రి అండగా నిలిచారు. తమకు అండగా నిలబడి, ఆర్థిక సాయం అందించిన హోంమంత్రి అనితకు బాబ్జి - లక్ష్మి దంపతులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

నా కుమారులను రక్షించండి.. మహిళ వినతి.. స్పందించిన పవన్

స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2025 | 03:46 PM