ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.
‘ఉచితం’ మాటున నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారు. పగలంతా ఒక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు రాష్ట్ర సరిహద్దులు దాటించి తమిళనాడుకు తీసుకెళుతున్నారు. ఇలా రాత్రింబవళ్లు ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కిమ్మనడంలేదు.
చీకటి పడితే చాలు.. ఆ వెంటనే ఎక్స్‌కవేటర్ల రొద మొదలవుతుంది. ప్రభుత్వ భూమిని చీల్చి గ్రావెల్‌ను తవ్వుతాయి. టిప్పర్లు రయ్‌మంటూ పరుగులు తీస్తాయి. ఇలా పూలతోటమిట్టలో మొదలయ్యే గ్రావెల్ అక్రమ రవాణా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలకు సాగుతోంది.
జిల్లాలో రూ. 113 కోట్లతో రెండు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం మంగళగిరి నుంచీ సీఎం చంద్రబాబుతో కలసి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు (టౌన్ బ్యాంక్) కార్యకలాపాలు గందరగోళంగా మారుతున్నాయి.
వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
తిరుపతి ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతున్న ఓ ఆడ పులి శనివారం మృతి చెందింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు టైగర్ రిజర్వ్ పరిధిలోని బైర్లూటి రేంజ్ ప్రాంతంలో గాయపడిన ఈ పులిని జూలై నెలలో చికిత్స కోసం తిరుపతి జూ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల సమస్యలపై ఈనెల 5వ తేదీన ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈనెల 27వ తేదీనుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహోత్సవాలకు వరసిద్ధుడి ఆలయం ముస్తాబవుతోంది. గురువారం నుంచి ఆలయానికి రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి.