Kakani Govardhan Reddy: గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు.. సీఐడీతో మాజీ మంత్రి
ABN , Publish Date - Aug 03 , 2025 | 07:35 PM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని (Kakani Govardhan Reddy) గుంటూరు సీఐడీ పోలీసులు ఇవాళ(ఆదివారం ఆగస్టు 3) కస్టడీలోకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇవాళ(ఆదివారం), రేపు(సోమవారం) కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారణ చేస్తున్నారు. కాకాణిని న్యాయవాది సమక్షంలో గుంటూరు సీఐడీ పోలీసులు ప్రశ్నించారు.
కాగా, మాజీ మంత్రి కాకాణి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు (సోమవారం) రెండో రోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని 26 ప్రశ్నలు అడిగారు. అయితే సీఐడీ పోలీసుల విచారణకు కాకాణి సహకరించడం లేదు. గుంటూరు సీఐడీ పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబు ఇవ్వలేదు. తనకు తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా, సంబంధం లేదు, తమ న్యాయవాదిని అడగాలని అంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాటవేత సమాధానాలు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News