Kakani: మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:15 PM
నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయంలో ఇవాళ(అదివారం) ఆయనను గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ, రేపు కాకాణిని పోలీసులు విచారించున్నారు. నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. కాకాణిపై న్యాయవాది సమక్షంలో ప్రశ్నలను సంధిస్తున్నారు. రికార్డుల తారుమారు కేసులో 14వ నిందితుడిగా కాకాణి ఉన్నారు. వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
అవసరం లేదు...
ఈ కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. గుంటూరు సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కాకాణి పాత్ర ఉందని, విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. కాకాణి తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో కాకాణిని నిందితుడిగా చేర్చారని, పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాకాణిని విచారణ నిమిత్తం నెల్లూరు జైలు నుంచి గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా కాకాణిని రెండు రోజులు విచారించనున్నారు.
ఇవీ చదవండి:
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
తన సీటులో మహిళ కూర్చుందని.. రెచ్చిపోయి అందరి ముందూ..