Home » Jagan
గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం మే 2న నిర్ణయం వెల్లడించనుంది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని, మద్యం వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు
మద్యం కుంభకోణం కేసులో పరారీలో ఉన్న కసిరెడ్డి రాజ్‌ను విచారణకు తీసుకురావాలని ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డిని సిట్ అధికారులు కోరారు. రాజ్ ఎక్కడున్నాడో తెలియదని ఉపేందర్ సమాధానమిచ్చారు
మద్యం కుంభకోణంలో తనపై అకారణంగా కేసు పెట్టారని ఐటీ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు,
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్‌తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్‌తో ఆయన వాగ్వాదం జరిగింది
కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఆరోపణలపై వైసీపీ మహిళా నేత పాలేటి కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్‌లోని ఆమెను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
జగన్ హెలికాప్టర్ ప్రయాణం వివాదాస్పదంగా మారడంతో కోపైలట్ శ్రేయాజ్ జైన్‌ను పోలీసులు విచారించారు.విండ్‌షీల్డ్ దెబ్బతినడంపై, షెడ్యూల్ లో తిరుగు ప్రయాణం ఉందా అనే అంశాలపై ప్రశ్నల వర్షం కురిసింది.
జగన్ పర్యటనలో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతిందన్న అంశంపై పైలట్, కో-పైలట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్ టేకాఫ్‌కు ముందు భద్రతా నిబంధనలు పాటించలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలను తిరస్కరించిన టీడీపీ నేతలు, ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ కుట్రను నమ్మవద్దని కోరారు
ఒకే హత్యపై జగన్ మీడియా రెండు సంచికల్లో రెండు రకాల కథనాలు ప్రచురించింది. కుటుంబ కక్షలపై జరిగిన హత్యను టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేసింది