టీటీడీ పరకామణి కేసుపై జగన్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Dec 04 , 2025 | 02:58 PM

టీటీడీ పరకామణి కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు.

తిరుమల , డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి కేసుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు. ప్రాయశ్చిత్తంగా రూ.14కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని, తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ వేశారని గుర్తుచేశారు.


మెగా లోక్ అదాలత్‌లో ఈ కేసును పరిష్కరించారని తెలిపారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక.. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఇదంతా తిరగదోడుతున్నారని విమర్శించారు. పరకామణి దొంగ.. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేశారని చెప్పుకొచ్చారు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని అన్నారు. తిరుమల హుండీ లెక్కింపును తమ ప్రభుత్వంలో పారదర్శకం చేశామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bijapur Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..

శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్‌

Read Latest AP News And Telugu News

Updated at - Dec 04 , 2025 | 09:57 PM