Share News

Marriage Funny Video: వరుడికి ఎదురుగా కూర్చున్న మరదలు.. బ్యాగులో చేయి పెట్టగానే.. ఒక్కసారిగా..

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:35 PM

ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరుడితో పాటూ పక్కన చాలా మంది కూర్చుని ఉంటారు. అయితే వరుడి ఎదురుగా కూర్చున్న మరదలు.. వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి ఏదో బయటికి తీసేందుకు ప్రయత్నించింది..

Marriage Funny Video: వరుడికి ఎదురుగా కూర్చున్న మరదలు.. బ్యాగులో చేయి పెట్టగానే.. ఒక్కసారిగా..

పెళ్లిళ్లలో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొందరు ఫన్నీ ప్రాంక్‌లు చేస్తే.. మరికొందరు వధూవరులను ఫూల్స్ చేసేందుకు వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. మొత్తం మీద అంతా కలిసి పెళ్లికి వచ్చిన అతిథులనే కాకుండా.. ఇటు నెటిజన్లకు కూడా వినోదాన్ని అందిస్తున్నారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంద. వరుడి ఎదురుగా కూర్చున్న మరదలు.. అతడిపై స్ప్రే కొట్టాలని చూసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరుడితో (Groom) పాటూ పక్కన చాలా మంది కూర్చుని ఉంటారు. అయితే వరుడి ఎదురుగా కూర్చున్న మరదలు.. వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి ఏదో బయటికి తీసేందుకు ప్రయత్నించింది. లోపలి నుంచి ఏం తీస్తుందబ్బా అని అక్కడున్న వారు ఆసక్తిగా చూస్తున్నారు.


ఇంతలో ఆమె లోపలి నుంచి స్ప్రే బాటిల్ బయటికి తీసి, వరుడిపై స్ప్రే చేయాలని చూసింది. అయితే అప్పటికే ఆమె ప్లానింగ్ గురించి తెలుసుకున్న వరుడు, మరికొంతమంది తలపై టవళ్లను కప్పుకున్నారు. ఇంతలో వరుడి వెనుక ఉన్న వారు పైకి లేచి, (Groom's friends spray on woman) సదరు యువతిపై స్ప్రే కొట్టారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగినట్లైంది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘యువతి కుట్రను వరుడు ముందే పసిగట్టాడు’.. అంటూ కొందరు, ‘పెద్ద యుద్ధమే జరిగిందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 09:35 PM