90 degree bridge: కొంపముంచిన ఇంజినీర్.. బ్రిడ్జ్‌ని ఎలా కట్టాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:39 PM
వింత వింత నిర్మాణాల గురించి తరచూ వింటుంటాం, చూస్తుంటాం. రోడ్డుకు రెండు వైపులా స్తంభాలు వేసి, దానిపై ఇల్లు కట్టడం, తక్కువ స్థలంలో ఎత్తుగా నిర్మించిన భవనం, త్రికోణం ఆకారంలో అపార్ట్‌మెంట్ నిర్మించడం చూశాం. ఇలాంటి..

వింత వింత నిర్మాణాల గురించి తరచూ వింటుంటాం, చూస్తుంటాం. రోడ్డుకు రెండు వైపులా స్తంభాలు వేసి, దానిపై ఇల్లు కట్టడం, తక్కువ స్థలంలో ఎత్తుగా నిర్మించిన భవనం, త్రికోణం ఆకారంలో అపార్ట్‌మెంట్ నిర్మించడం చూశాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఓ ఇంజినీర్ నిర్మించిన బ్రిడ్జ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. 90 డిగ్రీల కోణంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్.. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నిర్మాణంపై అధికారులు సీరియస్ అయ్యారు. మొత్తం ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.
సోషల్ మీడియాలో ఓ బ్రిడ్జ్ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో నిర్మించిన బ్రిడ్జ్.. ప్రస్తుతం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. భోపాల్ నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో రూ.18 కోట్లతో రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా షాక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది. 648 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్‌ని.. మధ్యలో ఒకేసారి 90 డిగ్రీల (90 degree bridge) కోణంలో మలుపు తిప్పారు.
ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవడంతో రాజకీయ నేతలు, అధికారుల దృష్టికి వెళ్లాయి. బ్రిడ్జ్ డిజైన్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర విమర్శనలు చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. మొత్తం ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది.
అయితే మరోవైపు బ్రిడ్జ్ నిర్మాణంపై సదరు సంస్థ వివరణ ఇస్తూ సమర్థించుకుంది. సమీపంలో మెట్రో స్టేషన్ ఉండడంతో భూమి కొరత ఏర్పడిందని తెలిపింది. దీంతో 90 డిగ్రీల కోణంలో నిర్మించాల్సి వచ్చిందని తెలిపింది. అయినా.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా ఎనిమిది మంది ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నామని, వారిలో ఏడుగురిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. కాగా, ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి