Bull Viral Video: ఎదురుగా ఎద్దు.. రోడ్డు మధ్యలో జాగ్వార్లు.. వెనక్కు తిరిగి చూడగానే..
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:47 PM
అడవిలో రోడ్డు మధ్యలో రెండు జాగ్వార్లు నిలబడి వేట కోసం వేచి చూస్తుంటాయి. కాసేపటికి ఆ మార్గం గుండా ఓ పెద్ద ఎద్దు ఠీవీగా నడుస్తూ వస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు భయపడతాయనే విషయం అందరికీ తెలిసిందే. భయపడడమే కాదు.. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా.. అనుకుంటూ కాళ్లకు బుద్ధి చెబుతుంటాయి. అయితే అన్నిసార్లూ ఇలాగే జరుగుతుందా.. అంటే జరగదని చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న జంతువులను చూసి తోకముడవాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు భయంతో పారిపోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు మధ్యలో ఉన్న జాగ్వార్లు.. ఎదురుగా వస్తున్న ఎద్దును చూసి భయంతో వణికిపోయాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో రోడ్డు మధ్యలో రెండు జాగ్వార్లు నిలబడి వేట కోసం వేచి చూస్తుంటాయి. కాసేపటికి ఆ మార్గం గుండా ఓ పెద్ద ఎద్దు ఠీవీగా నడుస్తూ వస్తుంది. జాగ్వార్లను చూసినా కూడా ఆ ఎద్దులో ఏమాత్రం భయం కనిపించదు.
అయితే ఎద్దు సమీపానికి రాగానే.. గమనించిన జాగ్వార్లు.. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాయి. రోడ్డు పక్కకు వెళ్లి.. అటు నుంచి అటే పొదల్లోకి పారిపోతాయి. వాటిని చూడగానే ఎద్దు కూడా దాడి చేసేందుకు మీదికి వెళ్తుంది. దీంతో ఆ జాగ్వార్లు మరింత భయంతో (Jaguars ran away after seeing bull) పరుగులు పెడతాయి. ఇలా జాగ్వార్లను సైతం ఎద్దు భయపెట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎద్దు పవర్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ప్రకృతి ఎంతో విచిత్రమైనది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 4.38 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి