Share News

Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - May 03 , 2025 | 03:51 PM

వింత వింత రెసిపీలతో వంట చేసే వారిని నిత్యం చూస్తుంటాం. అలాగే కలలో కూడా ఊహించని కాంబినేషన్లతో విచిత్ర వంటలు చేసే వారిని కూడా చూస్తుంటాం. అయితే తాాజాగా, ఓ మహిళ తయారు చేసిన వింత సూప్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ సూప్ తాగాలాంటే.. గట్స్ ఉండాలేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..
woman making soup with snake

పాముతో ఆటలాడేవారిని చూస్తుంటాం. మరికొందరు ఓ అడుగు ముందుకేసి వాటిని మెడలో వేసుకోవడం, నోట్లో పెట్టుకోవడం వంటి ప్రమాదకరమైన పనులు చేయడం కూడా చూస్తుంటాం. అయితే ఇదే పాములను చైనా వంటి దేశాల్లో ముక్కలు ముక్కలుగా కోసి వంట చేయడం చూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పాముతో సూప్ చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) సూప్ చేసేందుకు సిద్ధమవుతుంది. మామూలు సూప్ అయ్యుంటే ఇప్పుడు అది వార్త అయ్యుండేది కాదు. ఈమె ఏకంగా విష సర్పంతో సూప్ (Snake soup) చేసేందుకు సిద్ధమైందన్నమాట. బుట్టలో తీసుకొచ్చిన పామును బయటికి తీసి నీళ్లలో ఉడికించేసింది.

Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఆ తర్వాత కత్తి తీసుకుని పాముపై చర్మాన్ని మొత్తం తీసేసింది. ఆపై దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది. ఇలా పామును కట్ చేసి ఆ ముక్కలను పక్కన పెడుతుంది. తర్వాత పచ్చి ఉల్లిపాయ, నిమ్మకాయ, మిరపకాయతో పాటూ మసాసాలను సిద్ధం చేసుకుంటుంది. చివరగా పాము ముక్కలతో పాటూ మసాలా దినుసులన్నింటినీ నీళ్లలో వేసి ఉడికిస్తుంది. ఇలా ఫైనల్‌గా వేడి వేడి పాము సూప్‌ను తయారు చేస్తుంది. చివరగా దాన్ని ఓ గిన్నెలోకి పోసుకుని, స్పూన్‌లతో లాగించేస్తుందన్నమాట.

Funny Viral Video: మెరుపు వేగంతో తినడమంటే ఇదే.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. పాముతో సూప్.. చూస్తుంటేనే భయంగా ఉంది బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఈ సూప్ తాగాలంటే గట్స్ ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 68 వేలకు పైగా లైక్‌లు, 21 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 03:51 PM