Share News

Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - May 02 , 2025 | 07:59 PM

బాత్రూంలోకి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. లోపల కమోడ్‌‌కు పైన గోడకు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. చివరకు కారణం తెలుసుకుని అంతా తెగ నవ్వుకుంటున్నారు..

Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

సోషల్ మీడియా ప్రస్తుతం వినోదం, వింతలు, అద్భుతం, ఆశ్చర్యం.. ఇలా అనేక రకాల వీడియోలకు అడ్డాగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాత్రూంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే దాని రాసిన నోట్ చూసి తెగ నవ్వుకుంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. బాత్రూంలోకి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. లోపల కమోడ్‌‌కు పైన గోడకు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం (CCTV camera in the bathroom) చూసి అంతా అవాక్కయ్యారు. బాత్రూంలో సీసీ కెమెరా ఎందుకు పెట్టారబ్బా.. అంటూ చర్చించుకున్నారు.

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..


bathroom-CCTV-camera-funny-.jpg

అయితే అక్కడే గోడపై రాసిన నోట్ చూసి తెగ నవ్వుకుంటున్నారు. గోడపై అటించిన ఓ పేపర్‌పై ఇలా రాసి ఉంది. ‘‘చరిత్రలో మొదటిసారిగా బాత్రూంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం.. మీరు సక్రమంగా నీళ్లు పోయకపోవడమే. ఎవరైతే నీళ్లు పోయరో.. వారి వీడియోలను వైరల్ చేస్తాం’’.. అని రాయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..


బాత్రూంలో ఇలాంటి నిబంధన విధించి, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి నిబంధన ఎక్కడా చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇకపై ఎవరైనా నీళ్లు పోయాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 07:59 PM