Share News

Funny Viral Video: మెరుపు వేగంతో తినడమంటే ఇదే.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - May 02 , 2025 | 07:23 PM

ఓ యువకుడు, ఓ యువతి టేబుల్‌పై పుచ్చకాయ ముక్కలు పెట్టుకుని ఉంటారు. ఆ ముక్కలను ఎవరు వేగంగా తింటారు అనేది పోటీ. ఇద్దరూ పుచ్చకాయ ముక్కలను పట్టుకుని గెలుస్తామనే దీమాతో సిద్ధంగా ఉంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Funny Viral Video: మెరుపు వేగంతో తినడమంటే ఇదే.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆటలు ఆడటంలో కొందరు టాలెంట్ చూపిస్తే.. విచిత్ర విన్యాసాలు చేయడంలో మరికొందరు ప్రతిభను కనబరుస్తుంటారు. ఇంకొందరు ఎవరూ చేయలేని సహాసాలను ఎంతో సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్రమైన టాలెంట్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తినడంలో టాలెంట్ చూపించాడు. అతను తినే విధానాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మెరుపు వేగంతో తినడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు, ఓ యువతి టేబుల్‌పై పుచ్చకాయ ముక్కలు పెట్టుకుని ఉంటారు. ఆ ముక్కలను ఎవరు వేగంగా తింటారు అనేది పోటీ. ఇద్దరూ పుచ్చకాయ ముక్కలను పట్టుకుని గెలుస్తామనే దీమాతో సిద్ధంగా ఉంటారు.

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..


ఇద్దరూ పుచ్చకాయ ముక్కలను (watermelon) తినేందుకు తల కిందకు పెడతారు. యువతి వేగంగా తినేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇంతలో ఆ యువకుడు మెరుపు వేగంతో ఆ పుచ్చకాయను తినేస్తాడు. తాను తినడం స్టార్ట్ చేయగానే.. అతనేమో ఏకంగా తినడం పూర్తి చేయడం చూసి.. సదరు యువతి షాక్ అవుతుంది. అలా ఆ వ్యక్తి పుచ్చకాయను ఎంతో వేగంతో తినేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడు.

Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను ఏకంగా 10జీ స్పీడ్‌లో తినేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంత వేగంగా తినేయడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 07:23 PM