Cobra vs Dogs: కింగ్ కోబ్రాతో కుక్కల డేంజరస్ గేమ్.. చివరికి జరిగింది చూస్తే..
ABN , Publish Date - May 02 , 2025 | 09:11 PM
కొన్ని కుక్కల సమూహానికి ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అన్ని కుక్కలూ కలిసి చెలరేగిపోయాయి. కోబ్రాను చుట్టుముట్టిన కుక్కలు ఒకదాని తర్వాత ఒకటిగా దానిపై దాడికి దిగాయి. చివరికి ఏం జరిగిందో చూడండి..

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో.. తిక్క రేగితే అంతే రాక్షసంగా ప్రవర్తిస్తుంటాయి. మనుషుల్ని కాపాడే కుక్కలను చూస్తుంటాం. అలాగే మనిషి ప్రాణాలు తీసే కుక్కలను కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి కుక్కలు కొన్నిసార్లు ప్రమాదకరమైన పాములతో తలపడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో షాకింగ్ ఘటనలకు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని కుక్కలు కలిసి పెద్ద కోబ్రాతో డేంజరస్ గేమ్ ఆడాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కుక్కల సమూహానికి ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా అన్ని కుక్కలూ కలిసి చెలరేగిపోయాయి. కోబ్రాను చుట్టుముట్టిన కుక్కలు (Dog attack on King Cobra) ఒకదాని తర్వాత ఒకటిగా దానిపై దాడికి దిగాయి.
Bull Funny Viral Video: పిల్లాడిగా మారిన ఎద్దు.. స్కూటీని ఏం చేసిందో చూస్తే..
కుక్కల దాడితో అలెర్ట్ అయిన కింగ్ కోబ్రా.. వాటిపై బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా కుక్కలు ఆ కోబ్రా నుంచి ఎంతో తెలివిగా తప్పించుకుంటూ తికమకపెడుతూ కొరికేస్తుంటాయి. ఇలా చాలా సేపు వాటి మధ్య ఫైట్ నడుస్తుంది. ఈ పోటీలో కుక్కలే పైచేయి సాధిస్తాయి. ఈ వీడియో చూస్తుంటే కుక్కల దాడిలో కింగ్ కోబ్రా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ వీడియో చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘కింగ్ కోబ్రాకు చుక్కలు చూపించిన కుక్కలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Funny Viral Video: మెరుపు వేగంతో తినడమంటే ఇదే.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..