Robot Viral Video: ఇది రోబోనా లేక మనిషా.. ఎలా పని చేస్తుందో చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
ABN , Publish Date - Feb 21 , 2025 | 06:14 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి రావడం చూస్తున్నాం. మనుషులు చేసే పనులన్నీ చాలా వరకూ ప్రస్తుతం రోబోలే చేస్తున్నాయి. మనిషి రోబోలతో పాటూ జంతువుల రోబోలను కూడా తయారు చేయడం చూస్తున్నాం. అయితే రోబో ఏదైనా వాటి కదలికలు చూస్తే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి రావడం చూస్తున్నాం. మనుషులు చేసే పనులన్నీ చాలా వరకూ ప్రస్తుతం రోబోలే చేస్తున్నాయి. మనిషి రోబోలతో పాటూ జంతువుల రోబోలను కూడా తయారు చేయడం చూస్తున్నాం. అయితే రోబో ఏదైనా వాటి కదలికలు చూస్తే.. అవి రోబోలని తెలిసిపోయేలా ఉంటుంది. అయితే దీన్ని అధిగమించేందుకు పోలాండ్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అచ్చం మనిషిలా కదిలే రోబోను తయారు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పోలాండ్ (Poland) శాస్త్రవేత్తలు అచ్చం మనిషిలా కదిలే రోబోను తయార చేశారు. దీనికి ప్రోటోక్లోన్ అని పేరు పెట్టారు. అమెరికా, పోలాండ్‌లో ఉన్న క్లీన్ రోబోటిక్స్ (Robotics) అనే స్టార్టప్ కంపెనీ ఈ ప్రోటోక్లోన్ రోబోలను తయారు చేస్తోంది. ఈ రోబోలకు మనిషుల తరహాలో నకిలీ కండరాలు, ఎముకలు, కీళ్లను ఏర్పాటు చేశారు. ఇలా పూర్తిగా శరీర సింథటిక్ మానవ నమూనాతో రోబోను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇవి తమ చేతులు, కాళ్లను కదిలించడం చూస్తే.. అచ్చం మనుషుల్లాగానే అనిపిస్తోంది. శరీరం కూడా చూసేందుకు మనుషుల తరహాలో కండరాలతో ఉండంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణ రోబోలు చాలా ఇబ్బందికరంగా నడవడం చూస్తుంటాం. అయితే ఈ ప్రోటోక్లోన్ రోబోలు మాత్ర మనుషుల్లాగానే ఎంతో ఈజీగా నడుస్తున్నాయట. ఈ రోబోలను గాల్లో వేలాడదీసి.. కాళ్లు, చేతులు కదలికలను పరిశీలించారు. రోబోలు వాటి చేతులు, కాళ్లను కదిలించడం కూడా అచ్చం మనిషిలా ఉంది.
Viral Video: ఈ బైకును చోరీ చేయడం అంత ఈజీ కాదు.. ఇతను తీసుకున్న జాగ్రత్తలు చూస్తే నోరెళ్లబెడతారు..
ఈ ప్రోటోక్లోన్ రోబోలో మరిన్ని మార్పులు చేసి, సహజ సిద్ధంగా ఉండేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోబో వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘త్వరలో అచ్చం మనుషుల్లాగా ప్రవర్తించే రోబోలను చూస్తున్నామన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘ఈ రోబోలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా లైక్‌లు, 32 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..