Chandrababu On GST Meeting: ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:42 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
బ్రిటీష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన పౌరుషాల గడ్డ ఇదని ఉద్ఘాటించారు. 25 ఏళ్లుగా ప్రజాసేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని ప్రశంసించారు. ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్' బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
చాలా మంది ప్రధానులతో తాను పనిచేసినా.. మోదీ వంటి నేతను చూడలేదని అభివర్ణించారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ఉద్ఘాటించారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామని వివరించారు. ఆపరేషన్ సిందూర్.. మన సైనిక బలం నిరూపించిందని కొనియాడారు. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News