CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:26 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్నూలు, నంద్యాల జిల్లాల్లో (Kurnool, Nandyala) పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రధాని నాలుగోసారి పర్యటించారని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఉద్ఘాటించారు. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ పర్యటనలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. ప్రధాని మోదీ సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని పేర్కొన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనంపై ప్రధాని ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. ప్రధాని మోదీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని తెలిపారు. జీఎస్టీపై నెల రోజులపాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని
జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం
Read Latest AP News And Telugu News