Rammohan Naidu: ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో ప్రత్యేక విమానాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 10:40 AM
Union Minister Rammohan Naidu: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక విమానాలు నడిపించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు తనకు సమాచారం అందించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ: తెలుగు ప్రజలను సురక్షితంగా ఏపీకి చేర్చడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి నాలుగు ప్రత్యేక విమానాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని విమానాలు సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సర్జ్ ప్రైసింగ్‌కి బ్రేక్ – టికెట్ల ధరలు పెంచవద్దని విమాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో చర్చించారు. ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని అన్నారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో త్వరితగతిన చర్యలు చేపట్టి, బాధిత పర్యాటకులు, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు.
అక్కడి పరిస్థితి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి రెండు, ముంబైకి మరో రెండు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికులపై భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఏకకాలంలో టికెట్ల ధరలు పెంచకూడదని అన్ని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని అన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని తెలిపారు. ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, కశ్మీర్‌లో ఉన్న తెలుగు పర్యాటకుల రాకపోకలు సమన్వయం చేసేలా చర్యలు చేపట్టామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
అలాగే, పహల్గామ్ వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌలి కుటుంబానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని గౌరవంగా విమానమార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల మృతదేహాలను తరలించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం మానవతా ధోరణితో పని చేయడం ద్వారా రామ్మోహన్ నాయుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Andhra Pradesh Liquor Scam: జగన్ చెప్పారు.. నేను చేశాను!
PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం
Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్ ఇంట్లో ‘సైకిల్’పై చర్చ
Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు
Read Latest AP News And Telugu News