Rain Alert in AP: వాయుగుండం ప్రభావంతో వర్షాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:05 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వెల్లడించారు. అల్పపీడనం పశ్చిమ - వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు (బుధవారం) తుఫానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు.
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాబోయే 12 గంటల్లో ఉత్తర - వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించారు.
అల్పపీడన ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News