Share News

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:28 AM

Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం
Minister Narayana

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఏపీ రాజధాని అమరావతిలో మే 2వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యాటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. ఇవాళ(మంగళవారం) ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ మే 2 తేదీ మధ్యాహ్నం 3.25 నిమిషాలకు అమరావతికి చేరుకుంటారని తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.


అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించే అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని అన్నారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్లు, లే ఔట్ రోడ్లు 1500 కిలోమీటర్ల మేర నిర్మించేలా ప్లాన్ ఉందని చెప్పారు. గతంలోనే రూ.41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. 2019కు ముందు రూ.5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించామని అన్నారు. గత జగన్ ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.


గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్‌లు క్లోజ్ చేయలేదని మంత్రి నారాయణ అన్నారు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకు వచ్చిందని చెప్పారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్లేందుకు తమకు ఇంత సమయం పట్టిందని అన్నారు. అమరావతిలో రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ప్రకటించారు. అమరావతి రాజధాని పునఃప్రారంభం ప్రధాని చేస్తారని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. నిన్న(సోమవారం) రైతులతో సీఎం చంద్రబాబు రెండు గంటలపాటు పలు కీలక అంశాలపై మాట్లాడారని తెలిపారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. అమరావతిపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని రైతులు అడిగారని అన్నారు. చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్‌

Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్‌ పొడిగింపు

High Court: ఏబీవీ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 10:32 AM