Minister Narayana: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. ఈనెల 5 తర్వాత రెండో విడత భూ సమీకరణ
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:42 PM
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధి పనులు వేగవంతంగా జరగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు, విమానాశ్రయం వంటివి రావాలని.. అందుకే రెండో విడత భూసమీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని గుర్తుచేశారు. అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై గుంటూరు కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ ఇవాళ(బుధవారం) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా హజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడారు మంత్రి నారాయణ.
రెండో విడత భూ సమీకరణపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. రాజధానిలో స్మార్ట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తుండటంతో భూముల విలువ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. భూ సమీకరణపై ఎమ్మెల్యేలు శ్రావణ్, ప్రవీణ్ రైతులతో మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. భూ సమీకరణ కోసం రైతులు గ్రామసభల్లో సమ్మతి తెలిపారని పేర్కొన్నారు మంత్రి నారాయణ.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభమవుతోందని తెలిపారు. భూ సమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని అన్నారు. జరీబు భూములు, గ్రామ కంఠాల సమస్యలపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించారని చెప్పుకొచ్చారు. కొంతమందికి వాస్తు ప్రకారం ప్లాట్స్ రాలేదనే ఆరోపణలు ఉన్నాయని.. రైతుల అపోహలు తొలగించటం కోసమే త్రిసభ్య కమిటీ పనిచేస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..
Read Latest AP News and National News