Home » RJD
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
ఆర్జేడీ తరఫున పిటిషన్ సమర్పించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీనిపై సోమవారంనాడు విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ వేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై లాలూ మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుపుతామని, ప్రజల నుంచే ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తామని, దీనిపై ప్రజలతో చర్చిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము కానీయమని చెప్పారు.
ఆర్జేడీకు 13వ సారి జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అరుణ్ భారతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది నియంతృత్వం, బంధుప్రీతికి ప్రత్యక్ష సాక్ష్యమని..
తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.
రిలేషన్‌షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు మనోజ్ ఝా చెప్పారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తామని, ఎన్డీయేను ఓడిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు.