Share News

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:56 PM

ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్‌బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక
Tejashwi Yadav

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. పాట్నాలోని తేజస్వి నివాసంలో సోమవారంనాడు జరిగిన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘోపూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా తేజస్వి గెలిచారు.


ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్‌బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విస్తృత చర్చల అనంతరం ఈవీఎంల హ్యాకింగ్, ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరే ఓటమికి కారణాలనే అభిప్రాయానికి వచ్చారు.


ఈనెల 14న వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలిచి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో ఎన్డీయే 202 సీట్లు గెలుచుకోగా, మహాకూటమి 35 స్థానాలకు పరిమితమైంది. వీటిలో 25 స్థానాలను ఆర్జేడీ గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితమైంది.


ఇవి కూడా చదవండి..

10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు ఘటన నిందితుడు

88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 17 , 2025 | 06:52 PM