Home » Nagarjuna Sagar
కృష్ణా ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. దీంతో ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు సైట్ వద్ద 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా ఎనిమిది గేట్లు ఎత్తి 2.15 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం, గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
వచ్చే డిసెంబరు 24వ తేదీ దాకా నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ ఎం) పనులతోపాటు
రాష్ట్రవ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్ఠంగా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులకూ అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు.
ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 581.30 అడుగులకు నీరు చేరింది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా, ప్రాజెక్టు నిర్వహణను పర్యవేక్షిస్తున్న తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు.
నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు ఆదివారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నీరు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ఆనకట్టకు 1990 నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఏ కేటగిరిలో పెట్టిందని,
ఎగువ కృష్ణాలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..