Share News

Nagarjuna Sagar: సాగర్‌కు పొంచి ఉన్న ముప్పు

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:08 AM

నాగార్జునసాగర్‌ ఆనకట్టకు 1990 నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఏ కేటగిరిలో పెట్టిందని,

Nagarjuna Sagar: సాగర్‌కు పొంచి ఉన్న ముప్పు

  • ప్రాజెక్టు కుడివైపు ఎస్పీఎఫ్‌ మోహరింపునకు అనుమతివ్వండి

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ లేఖ

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఆనకట్టకు 1990 నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ‘ఏ’ కేటగిరిలో పెట్టిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌ను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలంగాణ రాష్ట్రం పేర్కొంది. ఇదే అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) మహమ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ ఈనెల 4వ తేదీన లేఖ రాశారు.


సాగర్‌ కుడివైపు(ఏపీ)లో పాయింట్‌ నెం. 515, 420, 250ల వద్ద రక్షణ లేదని, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కేవలం ప్రధాన డ్యామ్‌ రక్షణకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. దాంతో ఆనకట్టకు చుట్టు పక్కల రక్షణ వ్యవస్థ అవసరమని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఎడమ గట్టువైపు 12 పోస్టులో 70 మందికి పైగా ఎస్పీఎఫ్‌ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు రక్షణగా ఉన్నారని, కొన్నినెలలుగా ప్రాజెక్టు కుడివైపు మూడు గార్డు పోస్టుల(515, 420, 250) వద్ద రక్షణ కోసం సిబ్బంది లేరని పేర్కొన్నారు. డ్యామ్‌ సేఫ్టీ చట్టం-2021 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2023 నవంబరు 30కి ముందు, తర్వాత సాగర్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) పనులు సమర్థంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.


అయితే 3 పాయింట్లలో కాపలా కోసం ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక అధికారిని ఎస్పీఎఫ్‌ పంపించగా.. కృష్ణాబోర్డు అనుమతి లేకుండా ఆ పోస్టుల్లో కాపలాకు అనుమతించబోమని సీఆర్‌పీఎఫ్‌ అడ్డుకుందని గుర్తు చేశారు. దాంతో సాగర్‌కు పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఎస్పీఎఫ్‌ బలగాలు కాపలా కాయడానికి అనుమతించాలని ఈఎన్‌సీ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

Virat Kohli On His Retirement: గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్.. ఈ లాజిక్ మామూలుగా లేదుగా!

Updated Date - Jul 09 , 2025 | 01:18 PM