Share News

Nagarjuna Sagar: శ్రీశైలానికి వరద ఉధృతి

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:45 AM

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు సైట్‌ వద్ద 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా ఎనిమిది గేట్లు ఎత్తి 2.15 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar: శ్రీశైలానికి వరద ఉధృతి

  • నాగార్జున సాగర్‌కు వచ్చిన నీరు వచ్చినట్లే విడుదల

మహబూబ్‌నగర్‌/ నాగార్జునసాగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు సైట్‌ వద్ద 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా ఎనిమిది గేట్లు ఎత్తి 2.15 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా మరో 65 వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎంజీకేఎల్‌ఐతో కలుపుకొని ప్రాజెక్టు నుంచి 3.20 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.58 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అటు జూరాల, ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం వద్ద 3.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కాగానాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇక్కడ జూలై 29 నుంచి నీటి విడుదల ప్రారంభం కాగా, నాలుగు రోజుల్లో 54 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అఽధికారులు తెలిపారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు)కాగా శుక్రవారం సాయంత్రానికి 585.20 అడుగులుగా(298.0120 టీఎంసీలు) నమోదైంది. ఎగువ నుంచి సాగర్‌ జలాశయానికి 2,57,545 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 40.44 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఆ ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి 2,12,271 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. 2,05,278 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 03:45 AM