Krishna River: ఆల్మట్టికి పెరుగుతున్న వరద
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:49 AM
ఎగువ కృష్ణాలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..

93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
జూరాలకు 69 వేలు, శ్రీశైలానికి 75 వేల క్యూసెక్కుల ప్రవాహాలు
ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా కొనసాగుతున్న జలవిద్యుదుత్పత్తి..
హైదరాబాద్/నాగార్జునసాగర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఎగువ కృష్ణాలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను, గేట్ల ద్వారా 46 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. శుక్రవారం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటే అవకాశముందని సమాచారం. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు 86 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 73 వేల క్యూసెక్కులు గేట్ల ద్వారా, 6 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తికి విడుస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 69 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తితో పాటు గేట్ల ద్వారా 66 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 11 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తికి విడుస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 58 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి కోసం వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3 వేల క్యూసెక్కులను విద్యుదుత్పాదనకు వినియోగిస్తున్నారు. పులిచింతలకు ఇన్‌ఫ్లో లేనప్పటికీ కృష్ణా డెల్టా అవసరాల కోసం జలవిద్యుత్తు ఉత్పత్తికి 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ఉన్న జలాశయాల కింద భారీగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. గురువారం తెలంగాణలోని జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా 28 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుదుత్పతి కావడం విశేషం. ఇటు గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరుగుతోంది. నిజాంసాగర్‌కు 1,000 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌కు 8,718 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 1,293 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శ్రీపాద ఎల్లంపల్లికి 955 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. వచ్చే వారం రోజుల్లో ఎగువ గోదావరితో పాటు వార్ధా, వెన్‌గంగా, ప్రాణహిత, ఇంద్రావతి సబ్ బేసిన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రవాహాలు పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News