Share News

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 06:40 PM

బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు
Konda Murali

వరంగల్: ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇవాళ(గురువారం) వరంగల్ జిల్లాలోని పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.


ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్షగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో త్వరలోనే కొండా సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేస్తారని తెలిపారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. తమ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఉన్నారని కొండా మురళి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:47 PM