Share News

Congress VS BRS: కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:59 AM

మాజీ మంత్రి కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్‌కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు.

Congress VS BRS: కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Congress VS BRS

హనుమకొండ: మాజీమంత్రి కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) హెచ్చరించారు. వరంగల్‌కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి కేటీఆర్‌కి కనిపించడం లేదా... కళ్లు కనిపించకపోతే డాక్టర్ వద్దకు తీసుకుపోతానని ఎద్దేవా చేశారు నాయిని రాజేందర్ రెడ్డి.


ఇవాళ(శనివారం) హనుమకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. పదిమంది లంపెన్ గ్యాంగులతో కేటీఆర్.. కాంగ్రెస్ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు నాయిని రాజేందర్ రెడ్డి.


తాము తలచుకుంటే రోడ్లపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తిరగలేరని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే చూస్తు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రాకముందు దూకుడుగా ఉండేవాళ్లమని... ఇప్పుడు తమ చేతులని హై కమాండ్ కట్టేస్తోందని చెప్పుకొచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మీ చెల్లె కవిత చెప్పింది నిజం కాదా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.


శవాలపై పేలాలు ఏరుకునే రకం కేటీఆర్: ఎమ్మెల్యే నాగరాజు

NAGARAJU.jpg

మాజీమంత్రి కేటీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రకం కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. ఇవాళ(శనివారం) హన్మకొండలో మీడియాతో నాగరాజు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్ ఆర్థిక నేరస్తుడని.. ఆయన కుటుంబం అంతా నేరపూరితమైందని ఆరోపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా రొయ్యల పులుసుకు మీ నాన్న కేసీఆర్ అలవాటు పడితే.. నువ్వు లెగ్గులు,పెగ్గులకు అలవాటు పడ్డావని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఫాంహోస్‌లో ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్‌ కాదు.. ప్రమోషన్‌ శాఖ

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 19 , 2025 | 12:13 PM