CM Revanth Reddy: కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:22 PM
వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
హనుమకొండ, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): వరంగల్ (Warangal) నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. చెరువుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోపై లెక్కలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఇవాళ(శుక్రవారం) వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
నాళాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరి వల్ల వందల మంది ఆగం కావొద్దని సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని ఆజ్ఞాపించారు. ఇసుక మేటలు వేసిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేయాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వాళ్ల లిస్ట్ సిద్ధం చేసి ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ముంపు తీవ్రత పెరిగిందని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటన జరుగకుండా చూసుకోవాలని, వరద ప్రభావంపై పూర్తి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు విజిట్ చేయాలని హుకుం జారీ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
వరంగల్‌లో నాలాలు, చెరువుల కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వరంగల్‌లో మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఎందుకు లేదని ప్రశ్నించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. స్మార్ట్ సిటీ పథకంలో ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని ఆజ్ఞాపించారు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని సూచించారు. వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని.. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వదలండి.. క్షేత్రస్థాయికి వెళ్లాలని హుకుం జారీ చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ల పదవులు
తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News