Share News

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

ABN , Publish Date - Jul 19 , 2025 | 09:52 AM

రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి
MLA Komatireddy Rajgopal Reddy

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న(జులై18, శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ్యలో సీఎం మాట్లాడారు. ఈక్రమంలో రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి (MLA Komatireddy Rajgopal Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(x) వేదికగా ట్వీట్ చేశారు రాజ్‌గోపాల్‌రెడ్డి.


గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పెద్దలపై గుర్రుగా ఉన్నారు రాజ్‌గోపాల్‌రెడ్డి. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలని తప్పుపట్టారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్‌ కాదు.. ప్రమోషన్‌ శాఖ

ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 19 , 2025 | 10:02 AM