Rajgopal Reddy VS CM Revanth Reddy: పాలకులు గౌరవించాలే తప్పా.. అవమానించొద్దు.. సీఎం రేవంత్‌కి రాజ్ గోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:15 AM
నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీరుపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajgopal Reddy) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా ట్వీట్ చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్పా.. అవమానించడం సబబు కాదని హెచ్చరించారు.
నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని ఆరోపించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు.
కాగా, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను పదేళ్లు ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టడంపై కాంగ్రెస్ హై కమాండ్ కూడా రాజ్ గోపాల్ రెడ్డి నుంచి వివరణ అడిగింది. అయితే, తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై కూడా రాజ్ గోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డిపై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే రాజ్ గోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News