Share News

MLA Prabhakar Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రాజీవ్ యువ వికాస్ పేరుతో డ్రామా మొదలెట్టారు

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:38 PM

కాంగ్రెస్ నాయకులు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలు అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు.

MLA Prabhakar Reddy:  సీఎం రేవంత్‌రెడ్డి.. రాజీవ్ యువ వికాస్ పేరుతో డ్రామా మొదలెట్టారు
MLA Prabhakar Reddy

సిద్దిపేట జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ పథకాలను (Congress Schemes) ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌రెడ్డి (MLA Prabhakar Reddy) తెలిపారు. ఇవాళ(జూన్2) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను కొత్త కొత్త ప్రభాకర్‌‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలు అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు కొత్త ప్రభాకర్‌‌రెడ్డి.


యువతకు దగ్గర అవుదామని సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో డ్రామా మొదలుపెట్టారని కొత్త ప్రభాకర్‌‌రెడ్డి ఆరోపించారు. రాజీవ్ యువ వికాస్ పథకం వాయిదా వేయడమంటే ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని అర్థమని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నారా లేక మంత్రులు, ఎమ్మెల్యేలు నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో రిజిస్ట్రేషన్ కోసం యువత రూ.2000 ఖర్చు పెట్టుకుని నష్టపోతున్నారని వివరించారు కొత్త ప్రభాకర్‌‌రెడ్డి.


గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ నాయకుల పేర్లను మాత్రమే తీసుకుంటున్నారని కొత్త ప్రభాకర్‌‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉండటంతో ప్రజలు వాటిని తిరస్కరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేయాలి కానీ ప్రజలను మోసం చేయకూడదని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేయడం రాకుంటే తాము డైరెక్షన్ ఇస్తాం, అది కూడా కాదంటే ముఖ్యమంత్రినీ మార్చాలని కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2025 | 01:49 PM