Share News

Mahesh Goud Fires on KCR: ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:58 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.

Mahesh  Goud Fires on KCR:  ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్  గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
TPCC Chief Mahesh Kumar Goud

సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని అన్నారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. ఇవాళ(శనివారం) ఆందోలు మండలం సంగుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.


తనకి ఇష్టం ఉన్న చోట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రెండే పిల్లర్లు కుంగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని...ఇది సామాన్య విషయమా..? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కారు రేస్‌లో మాజీ మంత్రి కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా..? అని నిలదీశారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 04:05 PM