Home » kaleshwaram
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదిక అందజేశారు.
కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విచారణకు హాజరయ్యారు. బీఆర్‌కే భవన్‌లో మరోసారి పీసీ ఘోష్ కమిషన్‌ను హరీష్‌రావు కలిశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం మంత్రివర్గం తీసుకోలేదని, ఆ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు కవిత వెళ్లగా..
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్‌కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటల మాటలపై తుమ్మల మండిపడ్డారు.
కాళేశ్వరం విషయంలో క్యాబినెట్ నిర్ణయాల మేరకే అమలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ చెప్పారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.