CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీ
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:17 PM
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాశారు. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ(గురువారం) సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు. ఉగ్రదాడులు, ప్రస్తుతం అక్కడి పర్యాటకుల పరిస్థితి, పరిణామాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్‌లతో చర్చించారు. సాయంత్రం నిర్వహించ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.
ఏఐసీసీ కార్యాలయంలో అమరులకు కాంగ్రెస్ నేతల నివాళి
కాగా.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(CWC) ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. పహల్‌గామ్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. పహల్‌గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మృతులకు ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సల్మాన్ కుర్షిద్, అంబికా సోనీ, ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: రేవంత్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. కేటీఆర్ విసుర్లు
Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం
Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ముగ్గురు మావోలు మృతి
KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్
Read Latest Telangana News And Telugu News