Home » AICC
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.
మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, దీనిపై పార్లమెంటులో బిల్లు తేవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే వెంటనే తమ ఆమోదం తెలిపుతామని చెప్పారు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. గాడ్సే వారసులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసుల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
AICC: గుజరాత్‌లో అధికార పీఠాన్ని హస్తం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకొనేందుకు ఆ పార్టీ వడి వడిగా అహ్మదాబాద్ వేదిక నుంచి శ్రీకారం చూడుతోంది.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరించడంతో పాటు అనేక మంది జాతి హీరోలను కించపరచేలా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Janareddy Letter: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల తరపున ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు సీనియర్ నేత జానా రెడ్డి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఢిల్లీ పర్యటన రద్దయింది. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయనున్నారు.