Talasani Srinivas Yadav: అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్: తలసాని
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:34 PM
అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వ్యాఖ్యానించారు. ఇవాళ (సోమవారం) సనత్‌నగర్‌లోని బీకే గూడలో గల సీనియర్ సిటీజన్స్ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు పైబడిన 34 మంది, 70 సంవత్సరాలు పైబడిన 32 మంది సీనియర్ సిటీజన్స్‌ను శాలువాలతో సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తమ వయసు సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా సీనియర్ సిటీజన్స్ నిలుస్తున్నారని ప్రశంసించారు.
2014లో తాను సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సౌకర్యార్థం ఓ కార్యాలయం నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఉండాల్సిన సమయంలో సమాజానికి సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నానని, ఇక ముందు కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
సనత్‌నగర్ నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని చెప్పుకొచ్చారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా అభివృద్ధి పనులు జరగలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దూబే, మాజీ అధ్యక్షులు పార్థసారధి, మానిక్ రావ్ పాటిల్, సభ్యులు అనంతరెడ్డి, కృష్ణ దేవ్‌గౌడ్, సాయి, నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీసా రాకపోవడంతో మనస్థాపానికి గురై వైద్యురాలు ఆత్మహత్య
పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి
Read Latest Telangana News and National News